హీటెక్కిన మునుగోడు పాలిటిక్స్

మునుగోడు ఉప ఎన్నికలకు అన్ని పార్టీలూ సిద్ధమవుతున్నాయి. షెడ్యూల్ రాకముందే ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాయి

Update: 2022-08-12 03:54 GMT

మునుగోడు ఉప ఎన్నికలకు అన్ని పార్టీలూ సిద్ధమవుతున్నాయి. షెడ్యూల్ రాకముందే ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. దీంతో తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. పోటా పోటీగా సభలను నిర్వహించేందుకు అన్ని పార్టీలూ సిద్ధమవుతున్నాయి. ఈ నెల 5వ తేదీన ఇప్పటికే కాంగ్రెస్ బహిరంగ సభను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నెల 20వ తేదీన మునుగోడులో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది.

20న టీఆర్ఎస్ ....
టీఆర్ఎస్ బహిరంగ సభకు లక్ష మంది జనసమీకరణ లక్ష్యంగా నేతలు పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సభకు హాజరుకానున్నారు. నిన్న కేసీఆర్ తో జరిగిన సమావేశంలో నల్లొండ జిల్లా నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రజా దీవెన పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఈ నెల 21వ తేదీన చౌటుప్పల్ లో బీజేపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు అమిత్ షా హాజరవుతున్నారు.
21న బీజేపీ...
ఈ సభలో చేరికలు ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా రేపటి నుంచి పాదయాత్ర ప్రారంభించనుంది. ఈ నెల 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ మునుగోడులో పాదయాత్ర నిర్వహించాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది. అభ్యర్థులు ఎవరో ఖరారు కాకముందే పార్టీ పరంగా ప్రజల ముందుకు వెళ్లేంందుకు అన్ని పార్టీలూ సిద్ధమవుతున్నాయి. దీంతో ముందుగానే మునుగోడులో ఉప ఎన్నికల వేడి మొదలయింది.


Tags:    

Similar News