రూపాయిస్తే.. నాలుగు సిలిండర్లు

ఎన్నికల సమయంలో ఎన్నో పార్టీలు హామీల వర్షాన్ని గుప్పిస్తూ ఉంటాయి

Update: 2023-11-11 05:54 GMT

ఎన్నికల సమయంలో ఎన్నో పార్టీలు హామీల వర్షాన్ని గుప్పిస్తూ ఉంటాయి. ఇక కొందరు నేతలు ఇచ్చే వాగ్ధానాలు ఏ మాత్రం నమ్మశక్యంగా ఉండవు. తాజాగా ఓ అభ్యర్థి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే రూపాయికే నాలుగు సిలిండర్లు ఇస్తానని చెబుతున్నారు. ఒంటరిగా ఉండే వృద్ధుల కోసం ప్రతీ వంద ఇండ్లకు ఓ వాలంటీర్ ను నియమిస్తానని, ఇంట్లో అమర్చిన పానిక్ బటన్ నొక్కగానే వచ్చి సేవలందించే ఏర్పాట్లు చేస్తానని హామీ ఇవ్వడం విషయం. తనను గెలిపిస్తే ఈ హామీలన్నీ అమలు చేస్తానని సనత్ నగర్ నియోజకవర్గ బరిలో ఉన్న కుమ్మరి వెంకటేశ్ యాదవ్ చెబుతున్నారు. ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ టికెట్ పై కుమ్మరి వెంకటేశ్ యాదవ్ సనత్ నగర్ బరిలో ఉన్నారు. ఆయన ముందు బలమైన ప్రత్యర్థి ఉన్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రస్తుత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున డాక్టర్ కోట నీలిమ పోటీ చేస్తున్నారు.

రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటూ కాంగ్రెస్‌, రూ.400లకే ఇస్తామంటూ బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించాయి. వెంకటేశ్ యాదవ్ రూపాయికే నాలుగు సిలిండర్లు అందిస్తానని ప్రకటించారు. కుమ్మరి వెంకటేశ్ ఇచ్చిన హామీ కారణంగా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అయితే ఓట్లు ఎన్ని వస్తాయో.. బలమైన పోటీని తట్టుకుని డిపాజిట్లు అయినా దక్కించుకుంటారో లేదో చూడాలి.


Tags:    

Similar News