వ్యవసాయ కూలీ.. ఎక్సైజ్‌ ఎస్సైగా!

ఎటువంటి కోచింగ్‌ తీసుకోకుండా హైదరాబాద్‌ చిక్కడపల్లిలోని సెంట్రల్‌ లైబ్రరీలో చదువుకుని గ్రూప్‌-2లో ఎస్టీ కేటగిరీలో 27వ ర్యాంకు

Update: 2025-09-29 11:00 GMT

ఎటువంటి కోచింగ్‌ తీసుకోకుండా హైదరాబాద్‌ చిక్కడపల్లిలోని సెంట్రల్‌ లైబ్రరీలో చదువుకుని గ్రూప్‌-2లో ఎస్టీ కేటగిరీలో 27వ ర్యాంకు, ఓపెన్‌ కేటగిరీలో 752వ ర్యాంకు సాధించి ఎక్సైజ్‌ ఎస్సైగా ఉద్యోగం సాధించాడు భూక్య యాకూబ్‌. గ్రూప్‌-3లో సైతం ఎస్టీ కేటగిరీలో 8వ ర్యాంకు, ఓపెన్‌ కేటగిరీలో 644 ర్యాంకు సొంతమైంది. సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించి, వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ చదువుకున్న భూక్య యాకూబ్‌ ఎక్సైజ్‌ ఎస్సై పోస్టు అందుకున్నాడు. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం పోలారం గ్రామానికి చెందిన భూక్య భిక్షం, భిచ్చని దంపతులు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు యాకూబ్‌, శ్రీనివాస్‌, కూతురు గౌషా ఉన్నారు. కష్టపడి పీజీ దాకా చదువుకున్న యాకూబ్‌ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేందుకు వ్యవసాయకూలీగా వెళ్తుండేవారు. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని పట్టుదలతో చదివి అనుకున్నది సాధించాడు.

Tags:    

Similar News