Telangana : కొత్తగూడెం కార్పొరేషన్ పై తొలగిన సందిగ్దత
కొత్తగూడెం కార్పొరేషన్ లో కాంగ్రెస్, సీపీఐలకు మధ్య ఒప్పందం కుదిరింది.
కొత్తగూడెం కార్పొరేషన్ లో కాంగ్రెస్, సీపీఐలకు మధ్య ఒప్పందం కుదిరింది. చెరి రెండున్నరేళ్లు మేయర్ పదవిని పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్ లో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులపై కాంగ్రెస్, సీపీఐలు పంచుకున్నాయి. మేయర్ పీఠం ఎస్టీ జనరల్ కు రిజర్వ్ అయింది. కొత్తగూడెం కార్పొరేషన్ లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు.
చెరొక రెండున్నరేళ్లు...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీపీఐ నేతలు జరిపిన చర్చల్లో ఇద్దరూ కొద్దికాలం మేయర్ పదవిని పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. మొత్తం అరవై డివిజన్లున్న కొత్తగూడెం కార్పొరేషన్ లో కాంగ్రెస్ కు 22, సీపీఐకి 22 డివిజన్లు వచ్చాయి. ఇక్కడ బీఆర్ఎస్ కు పెద్దగా డివిజన్లు రాకపోవడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తమ మద్దతు సీపీఐకి ఇస్తామని చెప్పారు. మ్యాజిక్ ఫిగర్ 31 కావడంతో ఇప్పుడు కాంగ్రెస్, సీపీఐ కలిస్తే సునాయాసంగా మేయర్ పీఠాన్ని సులువుగా చేజిక్కించుకోవచ్చు.