నాలుగోరోజు ఆందోళన.. నేడు బండి రాక

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన నేడు నాలుగో రోజుకు చేరుకుంది.

Update: 2022-06-17 02:57 GMT

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన నేడు నాలుగో రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నాలుగురోజులుగా ఆందోళన చేస్తున్నారు. 12 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. ప్రభుత్వం డైరెక్టర్ ను నియమించినా ఫలితం లేదు. తమ డిమాండ్లు నెరవేరేంత వరకూ ఆందోళనలు కొనసాగుతాయని విద్యార్థులు చెబుతున్నారు. ప్రభుత్వం తరుపున కలెక్టర్ సంప్రదింపులు జరిపినా ఫలితం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడకు వచ్చి తమ సమస్యలను స్వయంగా పరిశీలించాలని విద్యార్థులు కోరుతున్నారు.

రాహుల్ సంఘీభావం...
ఇదిలా ఉండగా ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బాసర ట్రిపుల్ ఐటీ వద్దకు వెళుతున్నారు. విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు ఆయన వెళుతున్నారు. దీంతో పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అడుగడుగునా బ్యారికేడ్లు నిర్మించారు. బండి సంజయ్ రాకతో ఉద్రిక్తత చోటు చేసుకుంటుందని భావించిన పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సయితం ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు సంఘీభావంగా నిలిచారు. ట్రిపుల్ ఐటీ బాసర క్యాంపస్ లో దయనీయైన పరిస్థితులును ప్రభుత్వం పరిష్కరించాలని, సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థుల శక్తిని తక్కువగా అంచనా వేయవద్దని, కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలుస్తుందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.


Tags:    

Similar News