KTR : ఎనిమిది గంటల నుంచి కొనసాగుతున్న కేటీఆర్ విచారణ

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను దాదాపు ఏడు గంటలకుగా ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు

Update: 2025-06-16 11:38 GMT

KTR

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ ముగిసింది. దాదాపు ఏడు గంటలకుగా ఏసీబీ అధికారులు విచారించారు. ఫార్ములా ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ఏసీబీ అధికారుల ఎదుట హాజరయ్యారు. . ఈరోజు ఉదయం తన ఇంటినుంచి బయలుదేరి తెలంగణ భవన్ కు చేరుకుని అక్కడ కార్యకర్తలను కలుసుకున్న తర్వాత కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. పదిన్నర గంటల ప్రాంతంలో విచారణ ప్రారంభమయింది.

ఉదయం పదిన్నర గంటల నుంచి...
మధ్యాహ్నం అరంగట సేపు విచారణకు విరామంఇచ్చి తిరిగి విచారణ ప్రారంభించారు. ఫార్ములా ఈ కారు రేసు కేసులో హెచ్ఎండీఏ నిధులను మంత్రి వర్గం ఆమోదం లేకుండా విదేశీ కంపెనీలకు ఎలా పంపారంటూ ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ విషయంలో ఐఏఎస్ అధికారి విచారణకు వచ్చిన అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎస్ఎన్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు ప్రధానంగా విచారణ చేపట్టినట్లు తెలిసింది. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని ఏసీబీ అధికారులు తెలిపినట్లు సమాచారం.


Tags:    

Similar News