Telangana : మాజీ ఈఎన్సీ ఇళ్లలో ఏసీబీ దాడులు

తెలంగాణ మాజీ ఈఎన్సీ హరిరాం ఇళ్లు, ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు

Update: 2025-04-26 02:45 GMT

తెలంగాణలో నీటిపారుద శాఖ మాజీ ఈఎన్సీ ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ మాజీ ఈఎన్సీ హరిరాం ఇళ్లు, ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు ఈ రోజు తెల్లవారు జాము నుంచి తనిఖీలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరిరాం కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి.

కాళేశ్వరం మార్కెట్ లో...
ఈ నేపథ్యంలోనే మాజీ ఈఎన్సీ హరిరాం ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేసి తనిఖీలు చేస్తున్నారు. కీలక పత్రాల కోసం గాలిస్తున్నారు. ఉదయం ఐదు గంటల నుంచి ఈ తనిఖీలు ప్రారంభం కావడంతో పాటు ఆయన సన్నిహితుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News