భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

భద్రాచలం వద్ద గోదావరి లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 49.3 అడుగులకు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యా

Update: 2022-08-10 04:02 GMT

భద్రాచలం వద్ద గోదావరి లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 49.3 అడుగులకు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పైన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో మరోసారి ఉధృతి పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో అధికారులు లోతట్ట ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

ఎగువ కురుస్తున్న...
ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది పోటెత్తుతోంది. ఛత్తీస్‌ఘడ్, ఒడిశా లో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, నదులు ప్రవహిస్తున్నాయి. దీంతో గోదావరిలో మరోసారి నీటి మట్టం పెరుగుతోంది. ఇటీవల వరదముంపునకు గురైన భద్రాచలం ప్రాంత ప్రజలు ఇంకా తేరుకోక ముందే మరో సారి వరద హెచ్చరికలు జారీ కావడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. భద్రాచలం నుంచి చర్ల గ్రామాలకు రాకపోకలను బంద్ చేశారు.


Tags:    

Similar News