Telangana : ప్రయివేటు బస్సులపై రవాణా శాఖ దాడులు

కర్నూలులో జరిగిన వేమూరి కావేరి బస్సు ప్రమాదంతో తెలంగాణ రవాణా శాఖ అలర్ట్ అయింది

Update: 2025-10-25 02:55 GMT

కర్నూలులో జరిగిన వేమూరి కావేరి బస్సు ప్రమాదంతో తెలంగాణ రవాణా శాఖ అలర్ట్ అయింది. ప్రైవేట్‌ బస్సులపై చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. నేటి నుంచి హైదరాబాద్‌లో రవాణాశాఖ అధికారుల తనిఖీలు ప్రారంభించారు. నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల యాజమాన్యాలపై చర్యలు తీసుకునేందుకు ఉప క్రమించారు. ఆరు ప్రత్యేక టీమ్‌లతో అధికారులు తనిఖీలు చేపట్టారు.

అన్ని విషయాల్లోనూ...
ప్రైవేట్‌ బస్సులపై చర్యలకు సిద్ధమైన అధికారులు నేటి నుంచి హైదరాబాద్‌లో రవాణాశాఖ అధికారుల తనిఖీలు ముమ్మరం చేశారు.నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల యాజమాన్యాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉదయం నుంచి ఈ తనిఖీలు ప్రారంభమయ్యాయి. పర్మిట్లు, బీమా, ఫిట్ నెస్ సర్టిఫికెట్ల వంటి వాటిని పరిశీలిస్తున్నారు. నిబంధనలను అతిక్రమించిన వాటిపై చర్యలు తీసుకుంటున్నారు.


Tags:    

Similar News