Revanth Reddy : రేపు ఢిల్లీకి రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఏఐసీసీ కార్యాలయంలో జరగనున్న సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. రేవంత్ రెడ్డి వెంట ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీకి బయలుదేరనున్నారు. వారు సమావేశంలో పాల్గొన్న తర్వాత పార్టీ అగ్రనేతలతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు.
డీసీసీ అధ్యక్షుల నియామకంతో...
డీసీసీ అధ్యక్షుల నియామకంతో పాటు పలు అంశాలపై చర్చించే అవకాశముంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులతో పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనిపై కూడా పార్టీ నాయకత్వంతో చర్చించనున్నారు. పదవుల పంపకాలపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది.