Telangana : నేడు మద్యం షాపులకు లాటరీ
తెలంగాణాలో నేడు మద్యం షాపులకు లాటరీ ద్వారా కేటాయింపు జరగనుంది
తెలంగాణాలో నేడు మద్యం షాపులకు లాటరీ ద్వారా కేటాయింపు జరగనుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని మద్యం దుకాణాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి దాదాపు మూడు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఇక్కడ మద్యం షాపులకు దరఖాస్తు చేసుకున్నారు.
కలెక్టర్ల ఆధ్వర్యంలో...
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అత్యధిక దరఖాస్తులు రాగా, అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో ఉన్న మద్యం దుకాణాలకు ఇతర రాష్ట్రాల వారు వచ్చి దరఖాస్తులు చేశారు. మొత్తం 2,620 మద్యం దుకాణాలకు ఎక్సైజ్ శాఖ టెండర్లను పిలిచింది. ఈరోజు ఉదయం జిల్లా కలెక్టర్లు మద్యం దుకాణాల డ్రా ప్రక్రియను ప్రారంభించనున్నారు.