Telangana : తెలంగాణ ఇంటర్ పరీక్షలు ఎప్పటి నుంచి అంటే?
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది.
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 25న పరీక్షలు ప్రారంభమై మార్చి 18వరకు కొనసాగనున్నాయని బోర్డు ప్రకటించింది. విద్యార్థులు పూర్తి టైమ్‌టేబుల్‌ను పరిశీలించి, దాని ప్రకారం సన్నద్ధం కావాలని సూచించింది. మార్చి 18వ తేదీ వరకు పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది.
టైమ్ టేబుల్ మేరకు...
విద్యార్థులు టైమ్‌టేబుల్ పరిశీలించాలంటూ బోర్డు సూచించింది. ఇంటర్మీడియట్ పరీక్షలకు సిలబస్ ఇప్పటికే అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చాలా వరకూ పూర్తయింది. విద్యార్థులకు ప్రిపరేటరీ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు అవసరమైన మోడల్ ప్రశ్నాపత్రాలతో కూడా పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో అత్యధిక శాతం ఉత్తీర్ణులవ్వాలన్న లక్ష్యంతో బోధనా సిబ్బంది పనిచేయాలని సూచించారు.