Telangana : మేడారం జాతరకు కేసీఆర్ కు ఆహ్వానం

మేడారం జాతరకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రభుత్వం ఆహ్వానించింది.

Update: 2026-01-08 12:18 GMT

మేడారం జాతరకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రభుత్వం ఆహ్వానించింది. మేడారం జాతరకు రావాలని కేసీఆర్ ను మంత్రులు సీతక్క, కొండా సురేఖలు ఆహ్వానించారు. ఈ నెల 28వ తేదీ నుంచి మేడారం జాతర ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిన మంత్రులిద్దరూ కేసీఆర్ కు, సతీమణి శోభకు ఆహ్వాన పత్రం అందచేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ తమ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించామని చెప్పారు.

వస్త్రాలు పెట్టి...
హెలికాప్టర్ లో వచ్చి మేడారం సమ్మక్క, సారలమ్మను దర్శించుకుంటానని కేసీఆర్ చెప్పినట్లు మంత్రులు తర్వాత మీడియా సమావేశంలో చెప్పారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిన మంత్రులు కొండా సురేఖ, సీతక్కలకు కేసీఆర్ దంపతులు పసుపు, కుంకుమ, వస్త్రాలను అందచేశారు. అన్ని పార్టీల నాయకులకు స్వయంగా ఆహ్వానాలను అందచేశామని మంత్రి సీతక్క తెలిపారు. అందులో భాగంగానే కేసీఆర ను కూడా ఆహ్వానించామని తెలిపారు. మేడారం జాతరకు వస్తానని తమకు కేసీఆర్ తెలిపారని సీతక్క చెప్పారు.


Tags:    

Similar News