వెయ్యో వన్డేలో భారత్ అపూర్వ విజయం
భారత్ వెయ్యో వన్డేను తన సొంతం చేసుకుంది. అహ్మదాబాద్ లో భారత్ వెస్టండీస్ పై విజయం సాధించింది.
భారత్ వెయ్యో వన్డేను తన సొంతం చేసుకుంది. అహ్మదాబాద్ లో భారత్ వెస్టండీస్ పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 176 పరుగులకు ఆల్ అవుట్ అయింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ లో రోహిత్ శర్మ అరవై పరుగులు చేసి అవుటయ్యారు. కొహ్లి ఎనిమిది పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. రిషబ్ పంత్ 11 పరుగులకే రనైట్ అవుట్ అయి వెనుదిరిగాడు. ఇషాంత్ కిషన్ 28 పరుగులకే అవుటయ్యాడు. తర్వాత బరిలోకి దిగిన సూర్యకుమార్ యాదవ్, హుడాలు ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు.
నాలుగు వికెట్లు కోల్పోయినా.....
నాలుగు వికెట్లు కోల్పోయినా భారత బ్యాట్స్ మెన్లు సూర్యకుమార్ యాదవ్, హుడాలు భారత్ ను విజయతీరాలకు చేర్చారు. ఇషాంత్ కిషన్, రోహిత్ శర్మ, విరాట్ కొహ్లి, రిషబ్ పంత్ లు అవుటయినా భారత్ ను విజయ తీరాలకు చేర్చారు. చివరిగా సూర్యకుమార్ యాదవ్ ఫోర్ కొట్టి భారత్ కు చారిత్రాత్మక విజయాన్ని అందించారు. సూర్యకుమార్ యాదవ్ 34 పరుగులు, హుడా 28 పరుగులు చేసి 28 ఓవర్లోనే భారత్ కు విజయం సాధించి పెట్టారు.