ప్రశాంత్ కిషోర్.. దారెటు

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇకపై తెలుగుదేశం పార్టీకి వ్యూహాలు రచించబోతున్నారని

Update: 2023-12-23 12:45 GMT

 AP Politics

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇకపై తెలుగుదేశం పార్టీకి వ్యూహాలు రచించబోతున్నారని తెలుస్తోంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గన్నవరం విమానశ్రయంలో ప్రత్యక్ష మయ్యారు. వినాశ్రయం నుంచి బయటకు వచ్చిన పీకే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వాహనంలో విజయవాడ బయలుదేరారు. లోకేశ్​తో పాటు ఒకరిద్దరు తెలుగుదేశం నేతలు కూడా ప్రశాంత్ కిషోర్​ను కలిసి వెళ్లారు. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్​లో వైఎస్ జగన్ తరపున ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహాన్ని అమలు చేశారు. కొంతకాలం తెలంగాణలో కేసీఆర్ కోసం పనిచేసినా తర్వాత ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఊహించని విధంగా ప్రశాంత్ కిషోర్ టీడీపీ చెంత చేరారు. ఇప్పటి వరకూ టీడీపీ తరఫున రాబిన్ శర్మ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ను నియమిస్తారో లేదో అనే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

నారా లోకేష్, కిలారి రాజేష్‌లో కలిసి ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చారు ప్రశాంత్ కిషోర్. ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. ప్రశాంత్ కిషోర్‌, చంద్రబాబు సమావేశంలో గత కొంతకాలంగా టీడీపీ వ్యూహకర్తగా పనిచేస్తున్న రాబిన్ శర్మ కూడా పాల్గొన్నారు. రాబిన్ శర్మ టీం సర్వేలపై సమావేశంలో చర్చించారని తెలుస్తోంది. యువగళం పేరిట నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే. పాదయాత్ర ముగియడంతో పార్టీ ఎన్నికల సన్నద్ధతపై వివిధ స్థాయిల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. టికెట్ల కేటాయింపు, జనసేనతో పొత్త విషయంలో కూడా కీలక చర్చలు జరుగుతున్నాయి.

రాజకీయ సలహాదారుగా ఇన్ని రోజులూ పలు పార్టీలకు బాధ్యతలు వహించారు ప్రశాంత్ కిషోర్. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి అవ్వడంలోనూ.. ప్రధాని అవ్వడంలోనూ ఈయన స్థాపించిన I-PAC ముఖ్యకారణమని చాలా మంది నమ్మారు. ఆ తర్వాత పలు రాష్ట్రాలలో రాజకీయ పార్టీలకు అండగా నిలిచారు. భారతదేశంలోని ప్రముఖ రాజకీయ సలహా సంస్థ
I-PAC
లో ఒకప్పుడు కీలక వ్యక్తిగా ఉన్న కిషోర్, పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత తన రిటైర్మెంట్ ప్రకటించాడు. కేవలం రాజకీయాలలోనే ఉంటానని.. ఈ ఫీల్డ్ కు తిరిగి రానని మాట చేశారు. I-PAC ముఖంగా తనను తాను మార్కెట్ చేసుకున్న కిషోర్, బీహార్‌లో తన రాజకీయ పార్టీకి నిధుల కోసం I-PAC నాయకత్వ బృందంపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కిషోర్ ఐ-పీఏసీతో అన్ని సంబంధాలను తెంచుకుని రాజకీయ రంగంలో తనను తాను నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం I-PAC కార్యకలాపాలకు ప్రశాంత్ కిషోర్ తో ఎటువంటి సంబంధం లేదు. రాజకీయ సంప్రదింపులకు దూరంగా ఉన్నట్లు బహిరంగంగా ప్రకటించినప్పటికీ, కిషోర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ (TDP)తో కలిసి భారీ ఒప్పందం కుదుర్చుకున్నాడనే ప్రచారం సాగుతూ ఉంది. ప్రశాంత్ కిషోర్, నారా లోకేష్, శంతను (ప్రస్తుతం టీడీపీకి అనుబంధంగా ఉన్న షోటైమ్ కన్సల్టింగ్‌లో ఆపరేషన్స్ హెడ్), కిలారు రాజేష్ విజయవాడలో చంద్రబాబు నాయుడుని కలవడానికి వచ్చారు. కిషోర్ త్వరలో ఏమి చేయబోతున్నారో అని కూడా ఆంధ్రప్రదేశ్ లో చర్చించుకుంటూ ఉన్నారు.
అయితే ఒకటి మాత్రం క్లియర్.. రిషి రాజ్ సింగ్ (ఐ-పిఎసి), ప్రశాంత్ కిషోర్ మధ్య విభేదాలు స్పష్టంగా కనిపించాయి. పీకే బీహార్‌లో తన పాదయాత్రను ఆపేసి రంగంలోకి మరీ ఏపీ రాజకీయాల్లో దిగినట్లేనని తెలుస్తోంది. 2019లో YSRCP, జగన్‌కు ప్రశాంత్ కిషోర్ సహాయం చేసారు. ఇన్ని రోజులూ టీడీపీ-వైసీపీ మధ్య పోరు కొనసాగుతూ ఉండగా.. ఇకపై ప్రశాంత్ కిషోర్ Vs రిషి రాజ్ సింగ్ మధ్య గేమ్ లాగా కూడా ఉండబోతోంది.

 

Tags:    

Similar News