కటింగ్ షాప్ నుండి.. కోర్టులో న్యాయవాది దాకా!!

యెల్లందు పట్టణానికి చెందిన 42 ఏళ్ల పెట్టుగుడి ధనుంజయరావు ప్రయాణం

Update: 2024-01-31 11:14 GMT

చదువుకోడానికి వయసు అడ్డంకి కాదని చెబుతూ ఉంటారు. యెల్లందు పట్టణానికి చెందిన 42 ఏళ్ల పెట్టుగుడి ధనుంజయరావు ప్రయాణం గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆయన్ను మెచ్చుకుంటారు. క్షురకుడి నుండి న్యాయవాది అయ్యే వరకు ఆయన ప్రయాణం అద్భుతమనే చెప్పుకోవచ్చు. న్యాయవాద వృత్తిపై పెట్టుగుడి ధనుంజయరావుకు ఎంతో ఇష్టం ఉండేది.. అందుకే ఆయన ఎంతో కష్టపడి చదువును కొనసాగించారు. చివరికి న్యాయశాస్త్రంలో పట్టా పొందేలా చేసింది. ఆయన యెల్లందు పట్టణంలోని గోవింద్ సెంటర్‌లో ధనుస్ హెయిర్ స్టైల్ అనే హెయిర్ సెలూన్‌ను నడుపుతున్నాడు.

న్యాయవాది కావాలనేది తన చిరకాల వాంఛ అని.. అది సాధించగలిగినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. 2003లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వెంటనే LLBలో చేరాలనుకున్నాను కానీ కుదరలేదు. సంపాదన కోసం, నేను అదే సంవత్సరం కటింగ్ షాప్ ను స్థాపించానని అన్నారు. తన తండ్రి రామస్వామి ఆరోగ్యం క్షీణించడంతో కటింగ్ షాప్ చూసుకోవడానికి యెల్లందుకి తిరిగి వచ్చాడు. లాయర్ కావాలనే కోరిక అతని హృదయంలో ఉండిపోయింది. చివరకు LAWCETకి హాజరు అయ్యారు. 2018లో పరీక్షలో అర్హత సాధించి, హన్మకొండలోని ఆదర్శ న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ అడ్మిషన్‌ పొందారు. 2023లో కోర్సు పూర్తి చేసి, కొద్ది రోజుల క్రితం తెలంగాణ బార్‌ కౌన్సిల్‌లో అడ్వకేట్‌గా నమోదు చేసుకున్నారు.
ఎల్‌ఎల్‌బి పూర్తి చేయడంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నానని అన్నారు. ఒక వ్యక్తికి అంకితభావం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. న్యాయవాద వృత్తిపై నాకున్న ప్రేమ, నా మొదటి ప్రయత్నంలోనే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి న్యాయశాస్త్ర పట్టా పొందేలా చేసిందని అన్నారు. షాపులో ఖాళీ దొరికినప్పుడల్లా పరీక్షలకు ప్రిపేర్ అయ్యానని ధనుంజయరావు అన్నారు. యెల్లందులో సీనియర్ న్యాయవాది క్రింద జూనియర్‌గా పనిచేయాలని అనుకుంటున్నట్లు ధనుంజయరావు తెలిపారు. తన చదువుకు భార్య సత్యశ్రీ, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు సహకరించారని తెలిపారు.


Tags:    

Similar News