రెండు గంటలు లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన బాలుడు.. ఏమి చేశాడో తెలుసా?

లిఫ్ట్ లోపల అతను చేసిన పని చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. లిఫ్ట్ లోపలికి ప్రవేశించిన కొద్ది క్షణాలకే

Update: 2023-08-23 02:52 GMT

గ్రేటర్‌ ఫరీదాబాద్‌లోని సెక్టార్‌-86లోని ఓమాక్స్‌ హైట్‌ సొసైటీ లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ట్యూషన్‌కు వెళ్తున్న ఎనిమిదేళ్ల చిన్నారి రెండు గంటలపాటు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. సాధారణంగా ఆ సమయంలో మనం చాలా టెన్షన్ పడతాం. గుండె సాధారణం కన్నా వేగంగా కొట్టుకుంటుంది. చెమటలు పడతాయి.. లోపల నుండే లబోదిబో అంటాం. కానీ ఆ పిల్లాడు ఏ మాత్రం టెన్షన్ పడలేదు. ఎంతో కూల్ గా అతడు తన పని తాను చేసుకున్నాడు. ఇంతకూ ఆ పిల్లాడు ఏమి చేశాడనే కదా మీ డౌట్..!

లిఫ్ట్ లోపల అతను చేసిన పని చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. లిఫ్ట్ లోపలికి ప్రవేశించిన కొద్ది క్షణాలకే రెండవ అంతస్తులో ఇరుక్కుపోవడంతో అతను లిఫ్ట్ డోర్‌ను కొట్టి సహాయం కోసం అరిచాడు. కాని బయట నుండి ఎటువంటి ప్రతిస్పందన రాకపోవడంతో ఏడవకుండా.. తన భుజానికి ఉన్న బ్యాగును తెరిచాడు. బాలుడు తన హోంవర్క్ చేయడం ప్రారంభించాడు.
ఎలివేటర్‌లో ఇరుక్కుపోయినా టెన్షన్ పడలేదు. బయటకు వచ్చిన చిన్నారి క్షేమంగా ఉన్నాడు. అయితే, ఈ సంఘటనకు సొసైటీకి చెందిన రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్‌డబ్ల్యూఏ) కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. గురుగ్రామ్‌లో పనిచేస్తున్న చిన్నారి తండ్రి పవన్ చండిలా తమ కుటుంబం ఇక్కడి స్టూడియో అపార్ట్‌మెంట్‌లోని నాలుగో అంతస్తులో నివసిస్తుందని తెలిపారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగినప్పుడు పవన్ ఇంట్లో లేకపోవడం, అతని భార్య అస్వస్థతకు గురికావడంతో పిల్లాడిని ట్యూషన్‌ లో దింపేందుకు వెళ్లలేకపోయింది.
తన ఎనిమిదేళ్ల కొడుకు (గర్విత్) సాయంత్రం 5 గంటల సమయంలో ట్యూషన్ కోసం (గ్రౌండ్ ఫ్లోర్‌లో) ఇంటి నుండి బయలుదేరాడని పవన్ చెప్పాడు. గంట తర్వాత గర్విత్ రాలేదని అతని ట్యూషన్ టీచర్ ఫోన్ చేశాడు. దీంతో కంగారుపడి చిన్నారి కోసం వెతకగా ఎక్కడా కనిపించలేదు. బయటి నుంచి ఫోన్ చేయగా, తాను లిఫ్ట్‌లో ఇరుక్కుపోయానని గర్విత్ చెప్పాడు. RWA సభ్యులు, సెక్యూరిటీ సిబ్బంది అక్కడ లేకపోవడంతో అపార్ట్మెంట్ వాసులు కలిసి లిఫ్ట్‌ను తెరవడానికి ప్రయత్నించారు. మెయింటెనెన్స్ కార్యాలయాన్ని సంప్రదించి లిఫ్ట్ సిబ్బందికి ఫోన్ చేశారు. దాదాపు రెండు గంటల తర్వాత సాయంత్రం 7 గంటల సమయంలో లిఫ్ట్‌ తలుపులు తెరిచి చిన్నారిని బయటకు తీశారు. ఆర్‌డబ్ల్యూఏ నిర్లక్ష్యమే కారణమని.. ఎన్నో ఏళ్లుగా సంఘం లిఫ్ట్‌కు మరమ్మతులు చేయడం లేదని ఆరోపించారు. పిల్లాడు క్షేమంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏది ఏమైనా పిల్లాడు టెన్షన్ పడకుండా హోమ్ వర్క్ చేసుకున్నాడు చూడండి.. అది సూపర్ అంటూ నెటిజన్లు ఈ ఘటన గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు.


Tags:    

Similar News