తెలుగు టైపింగ్ లో సరికొత్త సెన్సేషన్ 'Desh Telugu Keyboard'
Desh Telugu Keyboard ద్వారా వాయిస్, చేతివ్రాత టైపింగ్, అనువాదం, స్టిక్కర్లు, థీమ్స్, చాట్ మరింత సరదాగా చేస్తుంది!
టైపింగ్ మన జీవితంలో ఒక భాగం. ఒకానొకప్పుడు టైపింగ్ అంటే చాలా కష్టమైన పని, అందరివల్లా అయ్యే పని కాదని అనుకునే వాళ్లం.. ఇప్పుడు టెక్నాలజీ మారుతూ వచ్చింది. కొత్త టైపింగ్ ఫార్మాట్స్, కొత్త కొత్త యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. కొన్నైతే ఏకంగా ట్రెండ్ సెట్టర్స్ గా నిలిచాయి. అలాంటి ఓ కీబోర్డు యాప్ 'Desh Telugu Keyboard'. ఈ టైపింగ్ యాప్ కేవలం తెలుగు, ఇంగ్లీష్ లాంటి భాషలను తెలిసిన వాళ్లే టైప్ చేయడానికి సృష్టించలేదు. ప్రతి ఒక్కరూ ఉపయోగించేలా తీర్చిదిద్దారు. టైపింగ్ చేసే వాళ్లకు ఏ ఫీచర్ కావాలి, ఎలా ఉంటే వినియోగదారులు వాడడం సులువుగా ఉంటుందని, ప్రతి ఒక్కటీ పరిగణలోకి తీసుకుని Desh Telugu Keyboard తీసుకుని వచ్చారు. క్షణాల్లో తెలుగు నుండి ఇంగ్లీష్.. ఇంగ్లీష్ నుండి తెలుగులోకి భాషను మార్చుకోడానికి వీలవుతుంది. తెలుగులో మీరు ఏదైనా చెప్పినా మీరు కోరిన పదాలు, వాక్యాలు మీ ముందు ఉంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో టైపింగ్ చేయలేనప్పుడు ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. జర్నలిస్టులు, కంటెంట్ రైటర్లు ఈ యాప్ ను తెగ ఇష్టపడతారు. ఎవరు మీ మాట వినకపోయినా ఈ టైపింగ్ యాప్ మాత్రం ఖచ్చితంగా వింటుంది.
Desh Telugu Keyboard ప్రత్యేకతలు:
తెంగ్లీష్ నుండి తెలుగు టైపింగ్
తెలుగు వాయిస్ టైపింగ్
తెలుగు చేతివ్రాత టైపింగ్
తెలుగు అక్షరాలతో కీబోర్డ్
ఇంగ్లీష్ టైపింగ్
ఇంగ్లీష్ వాయిస్ టైపింగ్
ఆంగ్ల చేతివ్రాత టైపింగ్
జస్ట్.. ఒక చిన్న క్లిక్ తో తెలుగు నుండి ఇంగ్లీష్ కు.. ఇంగ్లీష్ నుండి తెలుగుకు టెక్స్ట్ భాషను మార్చుకోవచ్చు.ఈ కీబోర్డ్ ని నిర్మించిన కంపెనీ ఇతర భాషల విషయంలో కూడా ఇలాంటి ఫీచర్ ను అందిస్తూ ఉన్నారు. అయితే ఆ ఫీచర్ ఇతర భాషల్లో కూడా కావాలంటే ఇతర భాషలకు సంబంధించిన కీబోర్డులను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఆ భాష కూడా సులువుగా టైపింగ్ చేసుకోడానికి వీలవుతుంది.
ఇందులోనే అనువాదం కూడా అందుబాటులో ఉంది. తెలుగు -> ఆంగ్లం, ఆంగ్లం -> తెలుగు అనువదించడంలో సహాయపడుతుంది కూడా!!
మరిన్ని ప్రత్యేకతలు:
1. సొంతంగా స్టిక్కర్లను సృష్టించవచ్చు
2. టెక్స్ట్ ను స్టిక్కర్‌లుగా మార్చవచ్చు
3. ఆటో రిసీవ్డ్ సేవ్ స్టిక్కర్లు
4. వర్గీకరించబడిన ఇన్‌బిల్ట్ తెలుగు GIFలు
5. విభిన్నమైన ఇంగ్లీష్ ఫాంట్స్
6. కీబోర్డ్ థీమ్స్
7. క్లిప్‌బోర్డ్
8. క్విక్ మెసేజెస్
ఫ్రెండ్స్ తో సరదాగా చాట్ చేసే సమయాల్లో కేవలం టెక్స్ట్ మాత్రమేనా? అలాంటప్పుడు ఫన్ ఏముంటది చెప్పండి!! కావలసినన్ని స్టిక్కర్స్ ను Desh Telugu Keyboard ద్వారా ఉపయోగించి నవ్వులు పూయించవచ్చు. ఫోటోలను ఉపయోగించి స్టిక్కర్లను క్షణాల్లో సృష్టించవచ్చు. ఒకటే కీ బోర్డు థీమ్ వాడి, వాడి బోర్ కొడితే కొత్త థీమ్ ను మార్చుకోవచ్చు. స్టైలిష్ కీ బోర్డు థీమ్ లతో టైపింగ్ ను కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇక క్విక్ మెసేజెస్, క్లిప్ బోర్డు లాంటి అదనపు హంగులు కూడా 'దేశ్ కీబోర్డు'ను ఇతర టైపింగ్ కీబోర్డుల కంటే భిన్నంగా మారుస్తుంది. ప్రతి ఒక్కరి మొబైల్ లోనూ తప్పక ఉండాల్సిన టైపింగ్ యాప్ ఇది. మరి ఇంకా ఏం ఆలోచిస్తున్నారు, తెలుగులో సులభంగా చాట్ చెయ్యడానికి ఇప్పుడే Desh Telugu Keyboard ని డౌన్లోడ్ చేస్కోండి.