సంక్రాంతి పండుగ తేదీలు మారాయి. ఈ మేరకు పండితులు ముహూర్త నిర్ణయించారు. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకుకొనసాగుతున్నాయి. జనవరి 14వ తేదీ బుధవారం భోగి పండుగ, మరియు ఏకాదశి ఈరోజు రాత్రి 9 గం 11 నిలకు సూర్యభగవానుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. రాత్రి సూర్య ప్రవేశం కాబట్టి మరుసటి రోజు పండుగ జరుపుకున్నారు.
ఈ నెల 14వ తేదీ నుంచి...
జనవరి 15వ తేదీ గురువారం మకర సంక్రాంతి పండుగ. బుధవారం రాత్రి రెండు గంటల నుంచి గురువారం పగలు 1 గం వరకు పుణ్యకాలం ఉంటుంది. ఈ సమయంలో స్నాన, దానాలు, పెద్దలకు తర్పణలు. స్వయంపాకాలు ఇవ్వాలని తెలిపారు. జనవరి 16వ తేదీ శుక్రవారం కనుమ పండుగ నిర్వహించుకుంటారు. జనవరి 17వ తేదీ శనివారం ముక్కనుమ పండుగ నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు.