ఉపరాష్ట్రపతి పదవి.. రేసులో ఎవరెవరు ఉన్నారంటే?
భారత ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడంతో ఆ పదవిలో మరో నేతను ఎన్నుకోనున్నారు.
భారత ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడంతో ఆ పదవిలో మరో నేతను ఎన్నుకోనున్నారు. బీజేపీ పార్టీ వర్గాల ప్రకారం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లేదా ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాజ్‌నాథ్‌సింగ్ ప్రధాని నరేంద్రమోదీకి, హోంమంత్రి అమిత్‌షాకు నమ్మదగ్గ నేత. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఇప్పటికే పదవీకాలం పూర్తయిన జేపీ నడ్డా పేరును కూడా అగ్రనేతలు పరిశీలిస్తున్నట్లు సమాచారం.మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఉపరాష్ట్రపతి పదవి రేసులో ఉన్నారని మీడియా వర్గాలు చెబుతోంది.