Bihar : బీహార్ లో పోలింగ్ శాతం ఎంతంటే?
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగిసింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగిసింది. సాయంత్రం ఐదు గంటల సమయానికి 67.14 శాతం పోలింగ్ జరిగిందని ఎన్నికల అధికారులు తెలిపారు. బీహార్ లో రెండో దశ ఎన్నికల ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ జరిగింది. సాయంత్రం ఐదు గంటల వరకూ క్యూ లైన్ లో ఉన్నవారిని పోలింగ్ కు అనుమతించారు.
122 నియోజకవర్గాల్లో...
అయితే బీహార్ లో మొదటి విడత కంటే రెండో విడత పోలింగ్ శాతం ఎక్కువగా జరిగింది. రెండో దశలో ఇరవై జిల్లాల్లో 122 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సరిహద్దులను మూసివేసి బయట వారిని ఎవరినీ అనుమతించలేదు. 3.70 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించు కోవాల్సి ఉంది. ఐదు గంటలకు 67.14 శాతం పోలింగ్ నమోదయిందని అధికారులు తెలిపారు. తొలి విడతలో 65 శాతం మాత్రమే పోలింగ్ శాతం నమోదయింది. ఇంకా క్యూ లైన్ లో పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉండటంతో 70 నుంచి 74 శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశాలున్నాయని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.