Bihar : నేడు బీహార్ లో మలిదశ ఎన్నికలు

బీహార్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది

Update: 2025-11-11 01:55 GMT

బీహార్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ జరగనుంది. రెండో విడతలో మొత్తం ఇరవై జిల్లాల్లో 122 అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఇప్పటికే మొదటి విడత ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఈరోజు రెండో దశలో ఎన్నికలు జరుగుతున్నాయి.

122 నియోజకవర్గాలకు...
పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేశారు. సమస్యాత్యక ప్రాంతాలను గుర్తించి అక్కడ భారీగా కేంద్ర బలగాలను మొహరించారు. బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ తో పాటు ప్రశాంత్ కిషోర్ కు చెందిన పార్టీ కూడా పోటీ చేస్తుంది. ఈ ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 14వ తేదీన జరగనుంది. తొలి విడతలో ఎక్కడా రీ పోలింగ్ అవసరం కాలేదు. ఇతర ప్రాంతాల నుంచి ప్రజలను, బయట వ్యక్తులను బీహార్ లోకి పోలీసులు అనుమతించడం లేదు.


Tags:    

Similar News