నేడు టీవీకే విజయ్ పరామర్శ

కరూర్ తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలను టీవీకే అధినేత విజయ్ నేడు పరామర్శించనున్నారు

Update: 2025-10-27 04:05 GMT

కరూర్ తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలను టీవీకే అధినేత విజయ్ నేడు పరామర్శించనున్నారు. చెన్నైకి సమీపంలోని ఒక రిసార్ట్ లో యాభై గదులను ముందుగానే బుక్ చేశారు. అందులో తొక్కిసలాటలో మరణించిన కుటుంబాలను విజయ్ పరామర్శించనున్నారు. కొన్నాళ్ల క్రితం కరూర్ సభలో జరిగిన తొక్కిసలాటలో నలభై మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే.

బాధిత కుటుంబాలను...
అప్పటి నుంచి ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లాలనుకుంటున్నారు. అయితే ఆయన అక్కడకు వెళితే తిరిగి సమస్యలు ఎదురవుతాయని భావించి మృతుల కుటుంబాలను చెన్నైకి రప్పించి ఒక రిసార్ట్ లో వారిని కలవనున్నారు. మృతుల కుటుంబాలకు ఇప్పటికే ఇరవై లక్షల రూపాయల నష్ట పరిహారాన్నివిజయం ప్రకటించిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News