Vice Presidential Election : రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక

రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఇప్పటికే ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ వేశారు

Update: 2025-09-08 03:24 GMT

రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఇప్పటికే ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఎన్.డి.ఎ తరఫున సిపి రాధాకృష్ణన్, ఇండి కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. పోలింగ్ కు రెండు కూటములు సిద్ధమయ్యాయి. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో బిజెపి ఎంపీలకు నిన్న వర్క్ షాప్ జరిగింది. నేడు విపక్షాల సభ్యులకు మాక్ పోల్ నిర్వహించనున్నారు.

బలం లేకపోయినా...
అయితే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో సంఖ్యాబలం ఎన్డీఏ వైపే కనిపిస్తుంది. ప్రస్తుతం పార్లమెంటు ఉభయసభల్లో ప్రస్తుతం 781 మంది సభ్యులుండగా వీరిలో పాలక కూటమి సంఖ్య 425, ఇండి 311, ఇతరులకు 45 మంది ఉన్నారు. క్రాస్ ఓటింగ్ పై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. అయితే అది ఎంత మేరకు పనిచేస్తుందన్నది చూడాల్సి ఉంది. రేపు సాయంత్రానికి ఫలితాలు తెలిసే అవకాశముంది.


Tags:    

Similar News