వరదలతో అతలాకుతలం.. భారీ ఆస్తినష్టం

జమ్ము కశ్మర్‌లో అకాల వర్షాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి.

Update: 2025-04-21 04:39 GMT

జమ్ము కశ్మర్‌లో అకాల వర్షాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు మరణించగా మరికొందరు గాయపడ్డారు. పదుల సంఖ్యలో వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. కొండ చరియలు విరిగిపడటంతో జమ్మూకాశ్మీర్ లోని రాంబన్ జిల్లాలో ట్రాఫిక్ స్థంభించి ఎక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. వరదలు కూడా రావడంతో అనేక ఇళ్లు నీట మునిగాయి.

ఈదురుగాలులు కూడా...
వడగళ్ల వానతో పాటు తీవ్రమైన ఈదురుగాలులు కూడా వీయడంతో కొందరు గల్లంతయ్యారు. గల్లంతయిన వారికోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. పెద్దయెత్తున ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. వందలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యారని, ఇళ్లు కోల్పోయారని ప్రభుత్వం ప్రకటించింది. పర్యాటకులు సయితం ఇబ్బందులు పడుతున్నారు.


Tags:    

Similar News