ఆపరేషన్ మహదేవ్ పై అమిత్ షా కీలక ప్రకటన
ఆపరేషన్ మహదేవ్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు
ఆపరేషన్ మహదేవ్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. లోక్ సభలో అమిత్ షా మాట్లాడుతూ పహాల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను మట్టుబెట్టామని చెప్పారు. ఉగ్రవాదులతో పాటు వారిని పంపిన వారిని కూడా చావుదెబ్బ కొట్టామని అమిత్ షా తెలిపారు. ఆపరేషన్ మహదేవ్ లో భాగంగా భద్రతాదళాలు యాసిన్, సులేమాన్, అబూలను మట్టు పెట్టామని చెప్పారు. ఉగ్రవాదుల నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ముగ్గురి ఉగ్రవాదులను...
ఈ నెల 22వ తేదీన తమకు ఉగ్రవాదులు అక్కడ ఉన్నట్లు సమాచారం అందిందని తెలిపారు. ముగ్గురిని మట్టుబెట్టినా విపక్షాలు ఆనందంగా లేవని అర్థమవుతుందని అమిత్ షా అన్నారు. చిదంబరంచేసినవ్యాఖ్యలపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హహాల్గాం దాడి తర్వాత ఉగ్రవాదులు పాక్ కు వెళ్లేందుకు ప్రయత్నించారని అమిత్ షా తెలిపారు.