Union Budget : నిర్మలమ్మ గుడ్ న్యూస్ చెప్పేస్తుందా? రెడీ అయిపోవాల్సిందేనా?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే నెల ఒకటోతేదీన బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.

Update: 2025-01-24 08:30 GMT

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే నెల ఒకటోతేదీన బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్ పై అనేక వర్గాల ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పటికే హస్తిన నుంచి అందుతున్న సమాచారం మేరకు ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఊరట కలిగేలా నిర్మలమ్మ బడ్జెట్ ఉంటుందని చెబుతున్నారు. ప్రధానంగా ఉద్యోగాలకు భారీ వెసులుబాటు లభిస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే దీనిపై కసరత్తులు దాదాపుగా పూర్తి చేసిన నిర్మలా సీతారామన్ ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా ఆదాయపు పన్నులో మినహాయింపు ఈసారి ఎక్కువగా ఉంటుందని అధికార వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి.

వేతన జీవులకు...
అందుతున్న సమాచారం మేరకు పది లక్షల రూపాయల వరకూ ఆదాయపు పన్ను మినహాయింపు ఇచ్చే అవకాశాలున్నాయి. ఏడాదికి పది లక్షల ఆదాయం వచ్చినా ఇక పన్ను చెల్లించాల్సిన పనిలేకుండా ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. అలాగే పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయలు ఆదాయం ఏడాదికి ఉన్న వారికి 25 శాతం పన్ను విధించే యోచన కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుందని తెలిసింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై భారం పడుతున్నప్పటికీ ప్రజలకు వెసులుబాటు కల్పించాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. ఇప్పటి వరకూ ఏడు లక్షల రూపాయల ఆదాయం ఏడాదికి ఉంటే వారికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఉంది. దానిన పది లక్షల రూపాయలకు పెంచే అవకాశముందని చెబుతున్నారు.
నిరుద్యోగులకు, రైతులకు...
దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ఖజానాకు లక్ష కోట్ల రూపాయల ఆదాయం గండిపడుతుందని అంచనా వేస్తున్నారు. పన్నుల విధానంలో మరిన్ని మార్పులు తెచ్చే విధంగా నిర్మలా సీతారామన్ వచ్చే నెల ఒకటోతేదీన ప్రకటన చేసే అవకాశముందని తెలిసింది. ధరలు విపరీతంగా పెరుగుతున్న సమయంలో వేతన జీవులకు ఇది పెద్ద ఊరట అని చెప్పాలి. ఈచర్యల వల్ల నగదు చెలామణి కూడా ఎక్కువగా జరిగే అవకాశముందని కూడా అంచనా వేస్తున్నారు. ఇక నిరుద్యోగులకు కూడా గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలున్నాయి. నిరుద్యోగ సమస్యను మరింత తగ్గిచడానికి అవసరమైనచర్యలు ప్రకటిస్తారంటున్నారు. నైపుణ్య శిక్షణ అందించేందుకు వివిధ పథకాలను ప్రకటించే ఛాన్స్ ఉంది. వీరితో పాటు దేశంలో అత్యధికంగా ఉన్న రైతుల కోసం మరింత ప్రయోజనాలు చేకూర్చేలా నిర్మలాసీతారామన్ ప్రకటన ఉంటుందని, రాయితీలతో పాటు వ్యవసాయరంగానికిపెద్దయెత్తున నిధులు మంజూరు చేసే అవకాశాలున్నాయి.


Tags:    

Similar News