Union Cabinet : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం.. కీలక నిర్ణయాలివే
ఈరోజు కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు
ఈరోజు కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్లపై చర్చించనున్నారు. ఉగ్రవాద కోణం ఉన్న ఈ పేలుళ్ల కేసుకు సంబంధించి మంత్రి వర్గ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్ లో మాట్లాడుతూ ఉగ్రవాద దాడిగానే చెప్పారు.
రైతులు, ఉద్యోగులు...
పేలుళ్లకు పాల్పడిన వారిని ఎవరినీ వదిలిపెట్టేదని హెచ్చరించారు. మృతుల కుటుంబ సభ్యులను ఆదుకుంటామని చెప్పారు. దీంతో ఈ ఘటనపైనే ప్రధానంగా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశముంది. దీంతో పాటు త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలపై కూడా మంత్రి వర్గంలో చర్చించే అవకాశముంది. అలాగే రైతులు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి.