Modi Cabinet : చివరి కేబినెట్.. ఎలాంటి నిర్ణయాలు ఉంటాయంటే?

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమయింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది

Update: 2024-03-13 07:02 GMT

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమయింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఈ టర్మ్‌కు ఇదే చివరి మంత్రి వర్గ సమావేశం కావడంతో ఎన్నికలకు ముందు మంత్రి వర్గ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నెల 15 లేదా 16 తేదీల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముండటంతో కీలక నిర్ణయాల దిశగా కేంద్ర కేబినెట్ సమావేశం తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు భారతరత్నపై  ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని కూడా ప్రచారం జరుగుతుంది. సినీ రంగంలో మాత్రమే కాకుండా, రాజకీయాల్లోనూ సంచలనాలు సృష్టించిన ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. 

కీలక నిర్ణయాల దిశగా...
అయితే ఎలాంటి నిర్ణయాలు ఈ చివరి మంత్రి వర్గ సమావేశంలో ఉంటాయన్నది మాత్రం బయటకు రాలేదు. దక్షిణాదిలో తమ బలం పెంచుకునేలా నిర్ణయాలు ఉండవచ్చన్న ప్రచారం జరుగుతుంది. రైతులు, మహిళలు ఉద్యోగ వర్గాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలకు నరేంద్ర మోదీ కేబినెట్ ఆమోదం తెలపనుందని కూడా ప్రచారం ఢిల్లీలో సాగుతుంది. అయితే చివరి మంత్రి వర్గ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు ఉండకపోవచ్చని, సాధారణ పనులకే ఆమోదం తెలుపుతారని అధికార వర్గాలు చెబుతున్నాయి.


Tags:    

Similar News