నేడు కేంద్ర మంత్రి వర్గం సమావేశం
నేడు కేంద్ర మంత్రి వర్గం సమావేశం జరగనుంది.
నేడు కేంద్ర మంత్రి వర్గం సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. ముఖ్యంగా తమిళనాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్ కు సంబంధించిన అంశాలపై చర్చించి ఆ యా రాష్ట్రాలకు ప్రయోజనాలు చేకూర్చే విధంగా నిర్ణయాలు ఉండే అవకాశాలున్నాయి.
మూడు రాష్ట్రాల ఎన్నికలు...
ఈ మూడు రాష్ట్రాల్లో ఈ ఏడాది ఎన్నికలు ఉండటంతో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. మరొకవైపు జాతీయ రహదారులపై కూడా చర్చించే అవకాశముంది. దీంతో పాటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా మోదీ ఈ సమావేశాల్లో మంత్రివర్గ సభ్యులతో చర్చించనున్నారు. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది.