Union Cabinet : నేడు కేంద్రమంత్రి వర్గ సమావేశం

నేడు కేంద్రమంత్రి వర్గ సమావేశం జరగనుంది

Update: 2025-12-31 02:12 GMT

నేడు కేంద్రమంత్రి వర్గ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉదయం పదకొండు గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో నూతన ఏడాది తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించి ఆమోదించే అవకాశాలున్నాయని తెలిసింది. కీలక అంశాలకు ఓకే చెప్పనుంది.

ఈ సమస్యలపై...
ప్రధానంగా వచ్చే ఏడాది జరగనున్న అసోం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు ఉండే అవకాశాలున్నాయి. అదే సమయంలో దేశ వ్యాప్తంగా రైతులు, ఉద్యోగుల సమస్యలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వ్యవసాయానికి సంబంధించిన కీలక అంశాలపై నేడు నిర్ణయం తీసుకునే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి.


Tags:    

Similar News