RBI : నిరుద్యోగులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్
నిరుద్యోగులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది
నిరుద్యోగులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. దేశ వ్యాప్తంగా వివిధ పోస్టులకు సంబంధించిన పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుల చేసింది. డిగ్రీ ఉత్తీర్ణులయిన విద్యార్థులు ఈ పరీక్ష రాసేందుకు అర్హులుగా నిర్ణయించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 650 అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
డిగ్రీ విద్యార్హతతో...
ముంబయి తో సహా దేశవ్యాప్తంగా వివిధ కార్యాలయాల్లో 249 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. డిగ్రీలో కనీసం 50% మార్కులు తో ఉత్తీర్ణత సాధించి కంప్యూటర్ పరిజ్ఞానం, సంబంధిత రాష్ట్ర భాషపై పట్టు అవసరం. ప్రారంభ వేతనం రూ.58,514 + అలవెన్సులుగా నిర్ణయించారు. ప్రిలిమ్స్, మెయిన్స్, భాషా నైపుణ్య పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్ లైన్ లో దరఖాస్తుకు మార్చి 08వ తేదీ ఆఖరు తేదీ. Official Website: https://opportunities.rbi.org.in నుంచి దరఖాస్తు చేసుకునే వీలుంది.