America : ట్రంప్ సుంకాల రద్దు..కోర్టు తీర్పు మండిపడిన అమెరికన్ ప్రెసిడెంట్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రపంచ దేశాలపై విదించిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం రద్దు చేసింది

Update: 2026-02-21 02:15 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రపంచ దేశాలపై విదించిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం రద్దు చేసింది. ఆయన ఆర్థిక అజెండాలో కీలకమైన అంశంపై ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అత్యవసర అధికారాల చట్టం ఆధారంగా విధించిన సుంకాలపై 6-3 మెజారిటీతో కోర్టు తీర్పు వెలువరించింది. దాదాపు అన్ని దేశాలపై ట్రంప్‌ అమలు చేసిన “పరస్పర” సుంకాలు కూడా ఇందులో ఉన్నాయి. ట్రంప్‌ మొదటి పదవీకాలంలో నియమించిన ముగ్గురు న్యాయమూర్తులతో కోర్టు రూపుదిద్దుకున్నప్పటికీ, ఈ వ్యవహారంలో మెజారిటీ ఆయన నిర్ణయాన్ని నిలబెట్టలేదు. సుంకాలు సహా పన్నులు విధించే అధికారం రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్‌కే చెందుతుందని ప్రధాన న్యాయమూర్తి జాన్‌ రాబర్ట్స్‌ స్పష్టం చేశారు. “పన్నుల అధికారంలో ఏ భాగాన్ని కార్యనిర్వాహక శాఖకు అప్పగించలేదు” అని ఆయన తీర్పులో పేర్కొన్నారు.

ఇప్పటికే దావా వేయడంతో...
న్యాయమూర్తులు స్యామ్యూయెల్‌ అలిటో, క్లారెన్స్‌ థామస్‌, బ్రెట్‌ కవానా విభేదించారు. “ఈ సుంకాలు సరైన విధానమా కాదా అనేది వేరే విషయం. కానీ చట్టపరంగా అవి చెల్లుబాటు అవుతాయి” అని కవానాఫ్ వ్యాఖ్యానించారు. సుంకాల రూపంలో వసూలైన వేల కోట్ల డాలర్లను కంపెనీలకు తిరిగి చెల్లించాలా అనే అంశంపై కోర్టు స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికే కోస్ట్‌కో వంటి పెద్ద కంపెనీలు తక్కువ స్థాయి కోర్టుల్లో రీఫండ్‌ల కోసం దావాలు వేశాయి. ఈ ప్రక్రియ క్లిష్టంగా మారే అవకాశం ఉందని కవానా పేర్కొన్నారు. అత్యవసర అధికారాల చట్టం కింద అధ్యక్షుడు విధించిన దిగుమతి పన్నుల ద్వారా డిసెంబరు నాటికి అమెరికా ఖజానాకు 133 బిలియన్‌ డాలర్లకుపైగా వసూళ్లు జరిగాయని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. వచ్చే దశాబ్దంలో దాని ప్రభావం సుమారు 3 ట్రిలియన్‌ డాలర్ల వరకు ఉంటుందని అంచనా.
ఇతర చట్టాల కింద...
ఈ తీర్పు కారణంగా ఇతర చట్టాల కింద సుంకాలు విధించడాన్ని ట్రంప్‌ ఆపాల్సిన అవసరం లేదు. అయితే వాటిపై వేగం, తీవ్రత పరిమితులు ఉంటాయి. పరిపాలనాధికారులు సుంకాల వ్యవస్థను కొనసాగించే మార్గాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. 1977లో తీసుకువచ్చిన అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం అధ్యక్షుడికి దిగుమతులను నియంత్రించే అధికారం ఇస్తుందని ట్రంప్‌ వాదించారు. అయితే ఆ చట్టంలో సుంకాల ప్రస్తావన లేదని కోర్టు స్పష్టం చేసింది. ఆ చట్టాన్ని పన్నుల కోసం వినియోగించిన తొలి అధ్యక్షుడు ట్రంప్ మాత్రమేనని రాబర్ట్స్‌ పేర్కొన్నారు. ఏప్రిల్‌ 2025లో వాణిజ్య లోటును జాతీయ అత్యవసర పరిస్థితిగా ప్రకటించి ట్రంప్‌ “పరస్పర” సుంకాలు అమలు చేశారు. కెనడా, చైనా, మెక్సికోపై కూడా మాదకద్రవ్య రవాణా సమస్య పేరుతో సుంకాలు విధించారు. దీనిపై పలు రాష్ట్రాలు, చిన్న వ్యాపార సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. అత్యవసర చట్టాలకు కూడా “ప్రధాన ప్రశ్నల సూత్రం” వర్తిస్తుందని మెజారిటీ న్యాయమూర్తులు పేర్కొన్నారు. విదేశాంగ వ్యవహారాల పరిధిలోనైనా రాజ్యాంగ పరిమితులు మారవని రాబర్ట్స్‌ స్పష్టం చేశారు.


Tags:    

Similar News