Narendra Modi : నేడు ఉత్తర్ ప్రదేశ్ లో మోదీ పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటించనున్నారు.

Update: 2026-02-22 04:31 GMT

ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మీరట్ లో మెట్రోను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. మెట్రో ప్రారంభోత్సవాలతో పాటు వివిధ పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారు.

పలు అభివృద్ధి పనులకు...
ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ మొత్తం 12,930 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభించనున్నారు. ఆ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. ప్రధాన పర్యటన సందర్భంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ మీరట్ లో బహిరంగ సభలో పాల్గొననుండంతోపెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు తరలి రానున్నారు.


Tags:    

Similar News