ఉదయనిధి స్టాలిన్ రెస్పాన్స్.. దేనికి సంకేతం
తిరుపతిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సనాతన
udayanidhi stalin
తిరుపతిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సనాతన ధర్మానికి భంగం కలిగితే తాను బయటికి వచ్చి పోరాడతానని అన్నారు. వారాహి సభలో మాట్లాడుతూ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పై కూడా విమర్శలు చేశారు. సనాతన ధర్మం వైరస్ లాంటిదని, ఆ మహమ్మారిని నిర్మూలించాలని అన్నారని, సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరు ఎవరైనా సరే దాన్ని నిర్మూలించాలనుకుంటే, వారే తుడిచిపెట్టుకుని పోతారని ధ్వజమెత్తారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించలేరంటూ పవన్ చేసిన వ్యాఖ్యలకు బదులిస్తూ ‘వేచి చూడండి. వేచి చూడండి’ అని స్టాలిన్ మీడియాతో అన్నారు. డీఎంకే అధికార ప్రతినిధి సయ్యద్ హఫీజుల్లా మాత్రం డీఎంకే ఎప్పుడూ ఏ మతాన్ని టార్గెట్ చేసుకోలేదని, కుల వివక్ష , అంటరానితనం, కులపరమైన వేధింపులపై మాత్రం తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. ఉదయనిధి స్టాలిన్ కూడా హిందూ మతానికి ఎప్పుడూ వ్యతిరేక ప్రకటనలు చేయలేదన్నారు.