టీవీకే అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయం
టీవీకే అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనలు వాయిదా వేసుకున్నారు
టీవీకే అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనలు వాయిదా వేసుకున్న విజయ్ కొన్ని రోజుల పాటు పర్యటనలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. పర్యటనలను టీవీకే అధినేత విజయ్ రెండు వారాల పాటు వాయిదా వేసుకున్నారు. కరూర్ తొక్కిసలాట నేపథ్యంలో టీవీకే పార్టీ అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారు.
వచ్చే వారం కరూర్ కు...
వచ్చే వారం కరూర్ బాధితులను విజయ్ పరామర్శించనున్నారు. కరూర్ సభలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన 41 కుటుంబాల వద్దకు వెళ్లాలని విజయ్ నిర్ణయించుకున్నారు. అయితే ఇందుకు పోలీసుల అనుమతి అవసరం అని భావిస్తున్నారు. అందుకోసం పోలీసుల అనుమతితో కరూర్ వెళ్లనున్న విజయ్ బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు.