నేడు సీబీఐ ఎదుటకు విజయ్

టీవీకే అధినేత విజయ్ నేడు సీబీఐ అధికారుల ఎదుట హాజరు కానున్నారు

Update: 2026-01-12 05:01 GMT

టీవీకే అధినేత విజయ్ నేడు సీబీఐ అధికారుల ఎదుట హాజరు కానున్నారు. కరూర్ లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి నేడు సీబీఐ అధికారులు విజయ్ ను విచారించనున్నారు. ఇప్పటికే కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించడంతో అందుకు సంబంధించిన ఆధారాలను సీబీఐ సేకరించింది.

విచారణలో కీలక అంశాలను...
విజయ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం తో కాకుండా సీబీఐ తో విచారణ జరిపించాలని కోరారు. నేడు సీబీఐ విచారణకు విజయ్ హాజరై కరూర్ తొక్కిసలాట ఘటనపై వివరణ ఇవ్వనున్నారు. తక్కువ సామర్థ్యం ఉన్న ప్రదేశంలో ఎక్కువ మంది హాజరు కావడంతో పాటు విద్యుత్తు సరఫరా నిలిపేయడం వల్ల కరూర్ తొక్కిసలాట జరిగి నలభై మందికి పైగా మరణించినట్లు ఇప్పటికే సీబీఐ అధికారులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.


Tags:    

Similar News