Sabarimala : అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్
శబరిమలకు వెళ్లే భక్తులకు ట్రావెన్ కోర్ దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది
శబరిమలకు వెళ్లే భక్తులకు ట్రావెన్ కోర్ దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ప్రతి రోజూ శబరిమలలో 90 వేల మంది భక్తులకు దర్శనం కల్పించనుంది. ఈ మేరకు రోజుకు 90 వేల మంది భక్తులు దర్శించుకునేలా ట్రావెన్ కోర్ దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. మండల పూజలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయ పాలక మండలి ఈ నిర్ణయం తీసుకుది. మండల,మకరవిళక్కు పూజ సమయంలో రోజుకు 90,000 మంది భక్తులను అనుమతించాలని శబరిమల దేవస్వం బోర్డు సమావేశం నిర్ణయించింది.
నవంబర్ ఒకటో తేదీ నుంచి ...
నవంబర్ ఒకటో తేదీ నుంచి బుకింగ్‌లు ప్రారంభమవుతాయని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా 70,000 మంది మరియు స్పాట్ బుకింగ్ ద్వారా 20,000 మంది మాత్రమే దర్శనం కోసం బుక్ చేసుకునే వీలుంది. అయ్యప్ప స్వాములు దయచేసి ఆన్ లైన్ బుకింగ్ లో మాత్రమే తమ దర్శనాన్ని బుక్ చేసుకోవాలని సూచించింది. అక్కడికి వెళ్లిన తర్వాత స్పాట్ బుకింగ్ కోసం ఎదురు చూడవద్దని, స్పాట్ బుకింగ్ అనేది కేవలం ఇరవై వేల టికెట్లు మాత్రమే అక్కడికి వెళ్లిన తర్వాత ఉండవచ్చు ఉండకపోవచ్చని, అందుకే ముందుగానే దర్శన టిక్కెట్లను బుక్ చేసుకోవాలని తెలిపింది.