శబరిమలలో భక్తుల రద్దీతో కిటకిట
భక్తుల రద్దీతో ట్రావెన్ కోర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది
శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. అయ్యప్ప భక్తులతో శబరిమల కిటకిటలాడుతుంది. అయ్యప్పస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని ట్రావెన్ కోర్ దేవస్థానం ప్రకటించింది. భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను చేసినట్లు శబరిమల ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తులు కూడా సహకరించాలని కోరుతున్నారు.
ట్రావెన్ బోర్డు నిర్ణయం మేరకు...
భక్తుల రద్దీతో ట్రావెన్ కోర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. స్పాట్ బుకింగ్ ఐదు వేల మందికే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈనెల 24 వరకు స్పాట్ బుకింగ్ ను పరిమితం చేయనుంది. భక్తులు ఎవరూ ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటుంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో శబరిమల దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.