జమ్మో నదిలో చిక్కుకుపోయి
జమ్ము కశ్మీర్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో ప్రధాన నదుల్లో నీటి మట్టం పెరిగింది.
జమ్ము కశ్మీర్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో ప్రధాన నదుల్లో నీటి మట్టం పెరిగింది. పలు నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. జమ్ములోని తావి నదిలో ఓ వ్యక్తి చిక్కుకుపోయాడు. నదిలోని ఓ వంతెన వద్ద సాయం కోసం ఎదురుచూస్తూ ఉండిపోయాడు. నదిలో నీటి ప్రవాహం పెరుగుతుండటంతో స్థానికులు సహాయ బృందాలకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది నిచ్చెన సాయంతో నీటి మధ్యలో చిక్కుకుపోయిన వ్యక్తిని సురక్షితంగా రక్షించారు.