చార్ ధామ్ యాత్రకు బ్రేక్... తొమ్మది మంది గల్లంతు
ఉత్తరాఖండ్ లో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలు కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. వరదలు ముంచెత్తుతున్నాయి.
ఉత్తరాఖండ్ లో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలు కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. వరదలు ముంచెత్తుతున్నాయి. ఉత్తర కాశీ జిల్లాలోని బార్ కోట్ - యమునోత్రి మార్గంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. అయితే వరదల్లో తొమ్మిది మంది కొట్టుకు పోయారు. వారంతా రోడ్డు నిర్మాణ కార్మికులుగా గుర్తించారు.
ఇరవై నాలుగు గంటలు...
ప్రమాదస్థితిలో స్యానాచిట్టిలోని కుప్దా కున్షాలా త్రిఖిలి వంతెన ఉందని అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో యుమునా నదిలో నీటి మట్టం పెరుగుతుండటంతో చార్ థామ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది. చార్ థామ్ యాత్రను తాత్కాలికంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిలిపివేసింది. భారీ వర్షాలతో చార్ ధామ్ యాత్ర 24 గంటలపాటు ప్రభుత్వం నిలిపివేసింది.