Parlament : నేడు వందేమాతరంపై పది గంటలు చర్చ
నేడు పార్లమెంటు సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి
నేడు పార్లమెంటు సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. నేడు లోక్ సభ లో వందేమాతరం పై చర్చ జరగనుంది. దాదాపు పది గంటల సేపు చర్చ జరగనుంది. జాతీయ గీతం వందేమాతరం 150 వార్షికోత్సవం సందర్భంగా లోక్ సభ, రాజ్యసభలలో ప్రత్యేక చర్చ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేడు లోక్ సభలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ వందేమాతరం పై చర్చను ప్రారంభించనున్నారు.
నేటి యువతరం...
వందేమాతరం లక్ష్యాన్ని నేటి తరం యువత తెలుసుకోవాల్సి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వందేమాతరంపై చర్చలో అన్ని పక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొనాలని ఇప్పటికే పాలక పక్షం కోరింది. రాజ్యసభలోనూ వందేమాతరం పై చర్చ జరగనుంది. వందేమాతరం విశిష్టతను దేశ ప్రజలు తెలుసుకుని అందుకు అనుగుణంగా మసలు కునేలా చర్చ జరగనుంది.