Loksabha Elections: నేడు మూడో దశ పోలింగ్

లోక్ సభ ఎన్నికల్లో మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమయింది

Update: 2024-05-07 02:47 GMT

లోక్ సభ ఎన్నికల్లో మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమయింది. మూడోదశలో పదకొండు రాష్ట్రాల్లో 93 పార్లమెంటు స్థానాలకు ఎన్నిక ప్రారంభమయింది. ఈ 93 స్థానాలకు 1,351 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మూడో దశ ఎన్నికలు జరిగే నియోజకవర్గాలలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పోటీ చేస్తున్న గాంధీనగర్, కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్ వంటి నేతలున్నారు. మోదీ అహ్మదాబాద్ లో తన ఓటు హక్కును కొద్దిసేపటి క్రితం వినియోగించుకున్నారు. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.

93 స్థానాలకు...
మూడో విడత జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ఉన్న 93 స్థానల్లో పథ్నాలుగు కర్ణాటక, పదకొండు మహారాష్ట్ర, పది ఉత్తర్ ప్రదేశ్ , తొమ్మిది మధ్యప్రదేశ్, ఏడు ఛత్తీస్ గడ్ స్థానాలతో పాటు 25 స్థానాలు గుజరాత్ లో ఉన్నాయి. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయిన పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పకడ్బందీగా పూర్తి చేయడంతో ఇప్పటి వరకూ పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోలేదు.


Tags:    

Similar News