ఇండిగో సంక్షోభం పై లోక్ సభలో గందరగోళం

ఇండిగో సంక్షోభం పై లోక్ సభలో గందరగోళం ఏర్పడింది.

Update: 2025-12-09 06:55 GMT

ఇండిగో సంక్షోభం పై లోక్ సభలో గందరగోళం ఏర్పడింది. ఇండిగో విమానాల రద్దుపై పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వివరణ ఇచ్చారు. ఇండిగో సంక్షోభాన్నిపరిష్కరిస్తున్నామని తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని మంత్రి కె. రామ్మోహన్ నాయుడు చెప్పారు 750 కోట్ల రూపాయలను ప్రయాణికులకు రీఫండ్ ఇప్పించామని తెలిపారు. ప్రయాణికుల భద్రతే ముఖ్యంగా కొన్ని నిబంధనలు తీసుకు రావడం జరిగిందని మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు.

మంత్రి వివరణ ఇస్తూ...
ప్రయాణికుల భద్రతే ముఖ్యంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇండిగో సీఈవో, సీఓఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని, డీజీసీఏ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ చర్యలు తీసుకుంటుందని మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వివరణ ఇచ్చారు. ఇండిగోకు డీజీసీఏ కూడా నోటీసులు జారీ చేసిందన్నారు. వారు ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా విపక్ష సభ్యులు నినాదాలతో లోక్ సభలో గందరగోళం ఏర్పడింది.


Tags:    

Similar News