అమిత్ షా చేతిలో రెడ్ ఫైల్ ఏంటి?
భారత ప్రభుత్వం పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఏం చర్యలకు దిగుతుందన్న ఆసక్తి ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది
భారత ప్రభుత్వం పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఏం చర్యలకు దిగుతుందన్న ఆసక్తి ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది. నిన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ లు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ సమావేశానికి వచ్చిన కేంద్ర హోం అమిత్ షా చేతిలో రెడ్ ఫైల్ ఉంది. అయితే ఆ రెడ్ ఫైల్ లో ఏముందన్న దానిపై పెద్దయెత్తున అంతర్జాతీయంగా చర్చ జరుగుతుంది.
పాక్ మీడియాలో కూడా...
ముఖ్యంగా పాకిస్థాన్ మీడియాకూడా ఈ రెడ్ ఫైల్ పైనే అనేక కథనాలను వండి వార్చాయి. అయితే పహాల్గాం దాడికి సంబంధించి భారత్ ఏదో చేయబోతుందన్న ప్రచారం అంతర్జాతీయ సమాజంలో నెలకొన్న నేపథ్యంలో అమిత్ షా రెడ్ ఫైల్ ను పట్టుకుని రాష్ట్రపతి వద్దకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఉగ్రవాదుల పై నిన్న బీహార్ లో ప్రధాని సయితం నిప్పులు చెరగడంతో రెడ్ ఫైల్ హాట్ టాపిక్ గా మారింది.