మామకు మళ్లీ తలనొప్పి తెస్తాడా?

ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ బీజేపీలో చేరేందుకు సిద్ధమయినట్లు ప్రచారం జరుగుతుంది

Update: 2023-04-18 08:08 GMT

మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బలమైనదే. కొన్ని ప్రాంతాల్లోనే దానికి పట్టుంది. దాని అధినేత శరద్ పవార్ కున్న ప్రత్యేక ఇమేజ్ ద్వారా ప్రతి ఎన్నికల్లో కనీస స్థానాలను సాధిస్తూ వస్తున్నారు. గత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలసి పోటీ చేసినా బీజేపీ, శివసేన కూటమికే విజయం లభించింది. అయితే చివరి నిమిషంలో మంత్రాంగం నడిపిన శరద్ పవార్ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చివేసింది. ఏక్ నాథ్ షిండే రూపంలో శివసేన చీలిపోయి బీజేపీతో కలసి తిరిగి అధికారంలోకి వచ్చింది.

30 మంది ఎమ్మెల్యేలతో...
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్సీపీ నేత, శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవర్ కూడా బీజేపీకి దగ్గరవుతున్నారని తెలిసింది. దాదాపు 30 మంది ఎమ్మెల్యేలతో ఆయన బీజేపీలో చేరేందుకు రెడీ అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. హుటాహుటిన మహారాష్ట్ర బీజేపీ నేతలు ఢిల్లీకి బయలుదేరడం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. ఎన్నికలు జరిగిన తొలి నాళ్లలోనే అజిత్ పవార్ బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ తో కలసి ఒకరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కూడా. మరోసారి 30 మంది ఎమ్మెల్యేలతో జంప్ అవ్వాలని నిర్ణయించుకోవడంతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అలర్ట్ అయ్యారని తెలిసింది. ముఖ్యనేతలతో ఆయన సమావేశయ్యారు


Tags:    

Similar News