నామినేషన్లకు మరో మూడు రోజులే గడువు

ఉపరాష్ట్రపతి ఎన్నిక నామినేషన్ల స్వీకరణకు మరో మూడు రోజులే గడువు ఉంది. ఇప్పటికే ఎన్టీఏ అభ్యర్థిగా రాధాకృష్ణన్ పేరు ఖరరాయింది

Update: 2025-08-18 06:01 GMT

ఉపరాష్ట్రపతి ఎన్నిక నామినేషన్ల స్వీకరణకు మరో మూడు రోజులే గడువు ఉంది. ఇప్పటికే ఎన్టీఏ అభ్యర్థిగా రాధాకృష్ణన్ పేరు ఖరరాయింది. ఇండి కూటమి కూడా తన అభ్యర్థిని బరిలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎన్నికను ఏకగ్రీవం చేయాలని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ రెడ్డి బీజేపీ తరుపున ప్రయత్నిస్తున్నారు. అయితే ఇండి కూటమి అభ్యర్థిని బరిలోకి దించితే పోటీ అనివార్యమవుతుంది.

ఎన్డీ కూటమి బరిలోకి దింపితే...
ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఈనెల 21వ తేదీ నామినేషన్ల స్వీకరణకు చివరి గడువుగా ఉంది. 22వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు. ఈ నెల 25 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు కౌటింగ్ జరుగుతుంది. రాజ్యసభ, లోక్ సభలో ప్రస్తుత ఎంపీల సంఖ్య 786 కాగా, ఉపరాష్ట్రపతి గెలవాలంటే 394 ఎంపీల బలం అవసరం అవుతుంది. జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామాతో ఎన్నికలు అనివార్యంగా మారాయి.


Tags:    

Similar News