అమెరికా కీలక నిర్ణయం.. ఉగ్రవాద సంస్థగా ప్రకటించి
పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను అగ్రరాజ్యం అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది
పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను అగ్రరాజ్యం అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ మేరకు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది తామేనని ప్రకటించుకున్న రెసిస్టెన్స్ ఫ్రంట్ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాకు చెందిన అనుబంధ సంస్థగా అమెరికా కూడా గుర్తించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు.
పహాల్గాంలో దాడి...
పహాల్గాంలో ఉగ్రవాదులు దాడులు చేసి అమాయకులైన పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని వారిని కాల్చి చంపిన ఘటనపై అమెరికా తీవ్రంగా స్పందిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. 2008 ముంబయి దాడి తర్వాత అతి పెద్ద దాడి పహాల్గాం అని ఆయన అన్నారు. అందుకే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ సంస్థను విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నట్లు అమెరికా పేర్కొంది.