ఆపరేషన్ సింధూర్ సమయంలో చాయ్‌, లస్సీ సైనికులకు అందించిన బాలుడు

భారత సైన్యం ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టిన సమయంలో ఓ బాలుడు చూపించిన తెగువ పట్ల దేశ ప్రజలందరూ ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు.

Update: 2025-05-29 13:50 GMT


భారత సైన్యం ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టిన సమయంలో ఓ బాలుడు చూపించిన తెగువ పట్ల దేశ ప్రజలందరూ ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. పాక్ సైన్యం కుట్రలను భారత సైన్యం దీటుగా తిప్పికొడుతున్నప్పుడు భారత సైన్యానికి ఓ పదేళ్ల బాలుడు కూడా అండగా నిలిచాడు. సైనికులకు మంచినీరు, పాలు, టీ, లస్సీ వంటివి అందిస్తూ ఆపరేషన్‌లో తనవంతు పాత్ర పోషించాడు.

పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్‌ జిల్లా మందేట్‌ ప్రాంతంలోని తారావాలీ గ్రామం అంతర్జాతీయ సరిహద్దుకు 2 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో అక్కడ భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. శ్రవణ్‌ సింగ్‌ అనే పదేళ్ల కుర్రాడు సైనికులకు తోడుగా నిలిచాడు. వాళ్లు అడగకముందే వారికి మంచినీరు, ఐస్‌, చాయ్‌, ఆహార పదార్థాలను అందించాడు. స్థానిక సైనికాధికారులు ఇటీవల ఆ బాలుడిని సత్కరించారు

Tags:    

Similar News