బళ్లారిలో మరోసారి టెన్షన్ .. గాలి ఇంటికి నిప్పు
బళ్లారిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది
బళ్లారిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. గాలి జనార్ధన్ రెడ్డి మోడల్ హౌస్ కు గుర్తు తెలియని వ్యక్తులు కొందరు నిప్పు పెట్టారు. దీంతో బళ్లారిలో తిరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల బళ్లారిలో గాలి జనార్థన్ రెడ్డి, కాంగ్రెస్ వర్గీయులకు మధ్య ఘర్షణ తలెత్తి కాల్పులు జరిగి కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఒకరు ఈ కాల్పుల్లో మరణించారు.
మోడల్ హౌస్ ను...
తిరిగి గాలి జనార్థన్ రెడ్డి మోడల్ హౌస్ ను కొందరు తగులపెట్టడంతో అది కాంగ్రెస్ వారి పనేనని గాలి జనార్థన్ రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. దీంతో అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనతో మరోసారి బళ్లారిలో తిరిగి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు భారీ బదోబస్తు ఏర్పాటు చేశారు.